
సమస్యలన్నీ పరిష్కరించండి
● గ్రీవెన్స్‌కు 329 అర్జీలు ● ఒక్కో అర్జీదారునిది..ఒక్కో ఆవేదన
తిరుపతి అర్బన్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసు కుంది.. ప్రతి అర్జీకి సంబంధించిన సమస్యను పరిష్కారించాలని జేసీ శుభం బన్సల్ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలకు కొందరు కలెక్టరేట్‌కు వస్తున్నారని, స్థానికంగా అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించి న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 329 అర్జీలు వచ్చాయి. అందులో 165 అర్జీలు రెవెన్యూ సమస్యలు కాగా వివిధ సమస్యలపై 100 మందికి పైగా ది వ్యాంగులు గ్రీవెన్స్‌లో అర్జీలు అందజేశారు. గ్రీవెన్స్ సమయంలో కొందరు అధికారులు కలెక్టరేట్ ప్రాంగణంలో తిరుగుతూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాలయాపన చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ సోమవారం మధ్యాహ్నం వరకు అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దామినేడులో నాగాలమ్మ ఆలయాన్ని ఓ నేత కూల్చివేశారని, అయితే తిరిగి నిర్మిస్తామని రెవెన్యూ అధికారుల వద్ద హామీ ఇచ్చిన పట్టించుకోవడం లేని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. డక్కిలి మండలం దగ్గువోలులో ఈ నెల 25, 26, 27 తేదీల్లో తాళమ్మ కొలుపు నిర్వహిస్తున్నందన గ్రామంలోని మద్యం దుకాణాన్ని మాసివేయాలన్నారు. రోడ్డు విస్తరణ లో ఇల్లు తొలగింపునకు అధికారులు మార్కింగ ఇ చ్చి రెండు నెలలైనా తమకు పరిహారం అందలేదని రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీకి చెందిన మంగమ్మ (78), వెంకటసుబ్బయ్య(81) దంపతులు జేసీకి విన్నవించారు. తాము లేచి నిలబడలేని స్థితి అని, తమ గ్రామస్తుడు శివప్రసాద్ తమను కలెక్టరేట్‌కు తీసుకొచ్చారన్నారు. వారిద్దరు కలెక్టరేట్‌లో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో బీపీ, షుగర్ పరీక్షలతోపాటు మందులు స్వీకరించారు.

సమస్యలన్నీ పరిష్కరించండి