
చెవిరెడ్డి అరెస్టుపై ప్రవాసాంధ్రుల నిరసన
తిరుపతి రూరల్ : చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టుపై ప్రవాసాంధ్రులు మండిపడ్డారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చెందిన ప్రవాసాంధ్రులు శుక్రవారం ‘వి సపోర్ట్ చెవిరెడ్డి’ అన్న ఫ్లెక్సీలను చేతపట్టుకుని నిరసన తెలిపారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సిడ్నీ నగరం నుంచి ఆయన వెంట మేముంటామన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సిడ్నీ నగర కన్వీనర్ అమరనాథరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతోందన్న విషయం అస్ట్రేలియాలో కూడా తెలిసిందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకంలో భాగమే చెవిరెడ్డి అక్రమ అరెస్టుగా భావిస్తున్నామన్నారు. నిరసనలో రాజ్‌బద్ధం, వివేక్ కొల్లేపల్లి, మనోహర్, గోపాల్, చంద్ర, మహేంద్ర, జనార్దన్ పాల్గొన్నారు.