శిక్షణకు ఎంపిక
శ్రీకాళహస్తి: ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా విధులు నిర్వహించే సంక్రాంతి రాజేంద్రుడికి అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో నేషనల్ ఎడ్యుకేషన్–2020 అనుసరించి అకడమిక్ ఇయర్ 2024–25 మూడో సెమిస్టర్‌కు సంబంధించి సింగ్ మేజర్ స్ట్రీమ్ ప్యాట్రన్‌లో భాగంగా రెండు కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఏపీసీసీఈ వారు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పట్టణంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగాధిపతి సంక్రాంతి రాజేంద్రుడు తిరుపతి జిల్లా తరఫున ఎంపికయ్యారు. ఈ అవకాశం రావడంతో ఆయన్ను కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత, అధ్యాపకులు వర్మ, బాపనయ్య, పరంధామయ్య తదితరులు అభినందించారు
శ్మశాన స్థలం ఆక్రమణపై ధర్నా
పుత్తూరు: పుత్తూరు మండలం తడుకు పంచాయతీలోని మజ్జిగ గుంట ఎస్టీ కాలనీ శ్మశాన స్థలాన్ని కబ్జాదారుల నుంచి పరిరక్షించాలని కోరుతూ గ్రామస్తులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ, పలు పోరాటాల ఫలితంగా 2018లో తడుకు గ్రామ లెక్క దాఖల సర్వే నంబర్ 169/2–ఎలో 50 సెంట్ల భూమిని మజ్జిగగుంట శ్మశానానికి ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈనెల 24న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్మశాన స్థలాన్ని జేసీబీతో చదును చేశారని తెలిపారు. కబ్జాదారులను గుర్తించి కఠినంగా శిక్షించి, ఆక్రమణల నుంచి శ్మశాన స్థలానికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు.
శిక్షణకు ఎంపిక


