
హైదరాబాద్: ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటనలో భార్యా, ప్రియుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సామల వెంకట రెడ్డి, ఎస్‌ఐ మహ్మద్ మజీద్ ఆలీలు తెలిపిన మేరకు.. రాజీవ్‌గాంధీ నగర్‌లో మహమ్మద్ షాదుల్, భార్య తబ్‌సుమ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కూతురు. నాలుగు సంవత్సరాల క్రితం తబ్‌సుమ్‌కు మొహమ్మద్ తాఫిక్ అనే వ్యక్తితో అయిన పరిచయం వివాహేతరసంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు.
దీంతో భర్త షాదుల్ అడ్డువస్తున్నాడని భావించిన భార్య.. ప్రియుడు మొహమ్మద్ తాఫిక్‌తో కలిసి షాదుల్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం తబ్‌సుమ్ ప్రియుడితో కలిసి ఆగస్టు 15న ఉదయం షాదుల్ పడుకున్న సమయంలో ఇద్దరూ కలిసి కొట్టి, దిండుతో ముక్కు, నోరు మూసి చంపారు. ఈ సంఘటపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితులైన తబ్‌సుం, ప్రియుడు మొహమ్మద్ తాఫిక్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.