వరంగల్: గోదాంలో అగ్నిప్రమాదం | Warangal: Fire Accident In Dress Godown | Sakshi
Sakshi News home page

వరంగల్: గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Apr 11 2022 10:48 PM | Updated on Apr 11 2022 11:09 PM

Warangal: Fire Accident In Dress Godown - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,వరంగల్: గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం టెస్కో గోదాంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా టెస్కోకు సంబంధించిన బట్టలు ఈ గోదాంలో నిల్వ ఉంచుతారు. 

దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు ఉన్నట్లు టేస్కో అధికారులు వెల్లడించారు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో గోదాము గోడలు కూలాయి. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలయాల్సి ఉంది. ఎవరైనా నిప్పు వేశారా.. లేక కరెంటు షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement