
వంజరపల్లిలో ఎస్టీ జనాభా జీరో
2019లో ఎస్టీలు లేక రెండు వార్డులు ఖాళీ
వరంగల్: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటన సంగెం మండలంలో చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతి పదికన కేటాయించిన రిజర్వేషన్లల్లో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చకు దారి తీసింది. మండలంలోని ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోగా 2011లో జనాభా లెక్కల్లో జరిగి న తప్పిదంతో ప్రస్తుతం ఎస్సీ మహిళకు సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడిందనే విషయం తెలిసిందే.. ఇలాంటిదే మరో అంశంపై తెరపైకి వచ్చింది. మండలంలోని వంజరపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయింబడింది.
కానీ, ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోవడం గమనార్హం. వంజరపల్లి పంచాయతీ పరిధిలో గతంలో రేఖియానాయక్ తండా ఉండేది. గత 2018లో తండాలు, శివారు గ్రా మాలను నూతన పంచాయతీలుగా చేసిన సమయంలో వంజరపల్లి పరిధిలోని రేఖియానాయక్ తండాను పోచమ్మతండా పంచాయతీలో విలీనం చేశారు. అప్పట్లో రెండు వార్డులు ఎస్టీలకు కేటా యించడంతో ఎస్టీలు లేక ఆ వార్డులు ఖాళీగానే ఉ న్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేష న్లు కేటాయించడంతో ఇప్పుడు వంజరపల్లి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. వంజరపల్లిలో 520 జనాభా 374 ఓటర్లుండగా ఒకరు కూడా ఎస్టీ లేకపోవడంతో సర్పంచ్ పదవి ఖాళీగా ఉండనుందా.. మార్చుతారా.. అనే చర్చ మొదలైంది.
2