బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Two people killed in Banjarahills Road Accident, Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి పంజాగుట్ట వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టింది.

ఈ సమయంలో అటుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీ కొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను భీమవరకు చెందిన ఈశ్వరి, రావులపాలెంకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top