బరాత్‌లో పెళ్లి కొడుకు ఓవరాక్షన్‌.. ఫోజులకు పోయి బాలుడిని చంపేశాడు

Tragedy In The Wedding Barat At Nalgonda - Sakshi

సాక్షి, న‌ల్ల‌గొండ: జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటుచేసుకుంది. చండూరు మండ‌లం గట్టుప్ప‌ల్ పెళ్లి వేడుకల్లో వరుడు చేసిన తప్పిదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది

వివరాల ప్రకారం.. గట్టుప్పలకు చెందిన మల్లేష్‌ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన యువతితో బుధవారం జరిగింది. కాగా, వివాహమైన తర్వాత వధువరులు కారులో వరుడి స్వగ్రామానికి వచ్చారు. దీంతో వరుడి ఇంటి వరకు దోస్తులు డీజే పాటలతో బరాత్‌ను ఏర్పాటు చేశారు. కాగా, వరుడి ఇంటికి కొద్ది దూరం ఉండగా.. మల్లేష్‌, వధువు కారులోని నుంచి దిగి బంధువులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్‌ స్టెప్పులు వేశారు. అనంతర వచ్చా కారులో కూర్చుకున్నారు. 

ఇదిలా ఉండగా.. బరాత్‌ను ఎంజాయ్‌ చేయడానికి కారు డ్రైవర్‌ కిందకు దిగడంతో వరుడు మల్లేష్‌.. డ్రైవర్‌ సీటులో కూర్చున్నాడు. తనకు డ్రైవింగ్‌ రాకపోయినా కారు నడిపే ప్రయత్నం చేశాడు.  దీంతో కారు ఒక్కసారిగా డ్యాన్స్‌ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే డ్యాన్స్‌ చేస్తున్న సాయిచరణ్‌ మృతిచెందాడు. ఈ క్రమంలో కారు నడిపిన మల్లేష్‌, సురేష్‌, గౌత‌మ్‌, ఆనంద్‌లకు గాయాలయ్యాయి. కాగా, బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పెళ్లి కొడుకు మల్లేష్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: కోర్టును ఆశ్రయించిన ప్ర‌జ్ఞారెడ్డి.. పుల్లారెడ్డి కొడుకు, మనవడికి నోటీసులు జారీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top