
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టెట్ పరీక్ష జూన్ 18 నుంచి 30 వరకూ జరిగింది.
పేపర్–1కు 63,261 మంది దరఖాస్తు చేయగా, 47,224 మంది పరీక్ష రాశారు. పేపర్–1లో మేథ్స్, సైన్స్‌కు 66,686 మంది దరఖాస్తు చేయగా, 48,998 మంది పరీక్షకు హాజరయ్యారు. సోషల్ స్టడీస్‌కు 53,706 మంది దరఖాస్తు చేయగా, 41,207 మంది పరీక్ష రాశారు.