ఇల్లులాంటిదే ఆస్పత్రి

Telangana State Human Rights Commission Chairman Chandrayaan Cleaning Hospital - Sakshi

మంచిర్యాల టౌన్‌: మన ఇల్లు లాంటిదే ఆసుపత్రి అని, ఇక్కడికి వచ్చిన వారు ఆరోగ్యంతో వెళ్లాలి తప్ప.. అశ్రద్ధతో కొత్తగా వ్యాధులను తెచ్చుకోవద్దని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జి.చంద్రయ్య హితవు పలికారు. శనివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఐసీయూ వార్డును ఆనుకుని ఉన్న బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నీరు సక్రమంగా రావడం లేదని ఓ రోగి సహాయకుడు ఫిర్యాదు చేయగా స్పందించిన చైర్మన్‌ వెంటనే వెళ్లి పరిశీలించారు.

బాత్రూంల బయట నీరు నిలిచి ఉండటాన్ని గమనించారు. దీంతో పక్కనే ఉన్న స్వైపర్‌తో ఫ్లోర్‌పై నిలిచిన నీరు మొత్తాన్ని స్వయంగా తొలగించారు. కొన్ని పనులను స్వయంగా చేసుకోవాలని రోగి సహాయకులకు సూచించారు. ఒక్కొక్క రోగికి సహాయంగా ముగ్గురు, నలుగురు రావడం వల్ల నీరు, పరిశుభ్రత సమస్యలు ఏర్పడతాయని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top