‘బండి’ పాదయాత్ర.. బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయి’ | Telangana: Nallu Indrasena Reddy Says Leaders Of Various Parties Will Soon Join The BJP Party | Sakshi
Sakshi News home page

‘బండి’ పాదయాత్ర.. బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయి’

Mar 20 2022 2:27 AM | Updated on Mar 20 2022 8:25 AM

Telangana: Nallu Indrasena Reddy Says Leaders Of Various Parties Will Soon Join The BJP Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీలోకి త్వరలో పలు పార్టీల నాయకుల చేరికలుంటాయని పార్టీ సీనియర్‌ నేత, పార్టీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌ పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులు బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.

వచ్చేనెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర సందర్భంగా ఈ చేరికలుంటాయన్నారు. శనివారం పార్టీ నాయకులు స్వామిగౌడ్, బీవీ మోహన్‌రెడ్డి, విఠల్, కొల్లి మాధవి, ప్రకాశ్‌రెడ్డిలతో కలిసి ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందువల్లే అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరికకు యత్నిస్తున్నారని తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement