తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త | Telangana Govt Line Clear To Govt Employees Transfers | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Apr 21 2026 1:42 PM | Updated on Apr 21 2026 2:06 PM

Telangana Govt Line Clear To Govt Employees Transfers

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ప్రభుత్వోద్యోగుల బదిలీలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో మే ఒకటో తేదీ నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీకి అనుమతి ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు దాటిన వారు బదిలీ కావడానికి అనుమతిని మంజూరు చేసింది. 

కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల  సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.  కొంతకాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ ఫైల్‌పై సీఎం రేవంత్  రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు వెల్లడించింది. ఇక, 2024లో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement