ప్రభుత్వ అధీనంలోకి మెట్రో.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు | Telangana Government Takes Full Control of Hyderabad Metro | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అధీనంలోకి మెట్రో.. చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణరావు

Apr 25 2026 6:55 PM | Updated on Apr 25 2026 7:15 PM

 Telangana Government Takes Full Control of Hyderabad Metro

హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎల్‌ అండ్‌ టీ మెట్రోపై 100 శాతం ఈక్విటీ ప్రభుత్వానికి బదిలీ అయింది. రూ.15,000 కోట్లతో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ద్వారా కొనుగోలు పూర్తయింది. ఎల్‌ అండ్‌ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి మెట్రో వచ్చేసింది. కొత్త బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్లర్ల నియామకం జరిగింది. 

మెట్రో చైర్మన్‌గా సీఎస్ రామకృష్ణ రావును నియమించారు. మెట్రో ఎండీగా సర్పరాజ్‌ అహ్మద్‌ కొనసాగుతారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు కీలక డైరెక్టర్‌ పదవులు దక్కాయి. షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేర్‌ కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వానికి మెజారిటీ షేర్‌ హోల్డింగ్‌ ఉంటుంది. హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు మిగిలిన షేర్లను కేటాయించారు. 

కాగా, ఎల్‌ అండ్‌ టీకి చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం (ఏప్రిల్‌ ) జీవో నంబర్‌ 127ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మెట్రోను టేకోవర్‌ చేసుకునేందుకు ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. 

నిజానికి ఈ ఏడాది మార్చి 30 నాటికే టేకోవర్‌ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది, అయితే, పలు అంశాలు కుదరకపోవడంతో ఆలస్యం జరిగింది. హైదరాబాద్‌ మెట్రో రైళ్ల సర్వీసులు 2017 నవంబరులో ప్రారంభయ్యాయి. అయితే, ఎల్‌అండ్‌టీకి అప్పటి నుంచి నష్టాలే ఎదురవుతున్నాయి. చివరకు మెట్రో రైళ్లను నడపలేమని ఎల్‌అండ్‌టీ చెప్పేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement