బీఎడ్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల | Sakshi
Sakshi News home page

బీఎడ్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

Published Wed, Sep 30 2020 8:59 PM

Telangana ED CET 2020 Examination Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో బీఎడ్‌ ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. అక్టోబర్ 1,3 తేదీలలో తెలంగాణ ఎడ్‌సెట్‌-2020 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్‌ఈఎస్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి మృణాళిని తెలిపారు. బీఎడ్‌ 2 సంవత్సరాల కోర్సులో ప్రవేశాల కోసం జరిగే  ఎడ్‌సెట్‌ 2020 పరీక్షలకు మొత్తం 43380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. వీరిలో 10339 మంది పురుషులు (24%), 33041 మంది స్త్రీలు ఉన్నట్లు వెల్లడించారు. మూడు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 న మధ్యాహ్నం 3 గంటల నుంచి సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. (టీఎస్‌ ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి)

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం సెషన్  3.00 నుండి సాయంత్రం 5.00 వరకు ఉండనున్నట్లు తెలిపారు. మార్నింగ్ సెషన్‌లో మెథడాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, మధ్యాహ్నం సెషన్‌లో బయోలాజికల్ సైన్సెస్, ఇంగ్లీష్,ఓరియంటల్ లాంగ్వేజెస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 7 పరీక్షా కేంద్రాలు (కర్నూలు, విజయవాడ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్ టికెట్లను https://edectische.ac.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి 9 గంటలకు చేరుకోవాలని కోరారు. ఒక నిమిషం నిబంధన అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు తమ సొంత మాస్క్‌ను తీసుకురావాలని, వాటర్ బాటిల్, గ్లోవ్స్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్, తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్‌ వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement