పాలమూరుకు సీఎం కేసీఆర్‌  | Telangana CM KCR To Visit Palamuru On December 4th 2022 | Sakshi
Sakshi News home page

పాలమూరుకు సీఎం కేసీఆర్‌ 

Dec 4 2022 12:41 AM | Updated on Dec 4 2022 4:00 PM

Telangana CM KCR To Visit Palamuru On December 4th 2022 - Sakshi

విద్యుత్‌ కాంతులతో కలెక్టరేట్‌ భవనం  

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం పాలమూరుకు రానున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో వచ్చి బస్టాండు సమీపంలో నిర్మించిన జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పాలకొండ వద్ద రూ.52 కోట్లతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు.

మధ్యాహ్న భోజనం అనంతరం క్రిస్టియన్‌పల్లిలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు.  ఇప్పటికే నాయకులు, కార్యకర్తలు మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని సుందరంగా తీర్చిది ద్దారు. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, తోరణాలే కనిపిస్తున్నాయి. బహిరంగ సభ కోసం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగా జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. సీఎం ప్రసంగాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభ తర్వాత కేసీఆర్‌ సాయంత్రం హెలికాప్టర్‌లో తిరుగు పయనమవుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement