టీఎస్‌ అసెంబ్లీ: కేటీఆర్‌ Vs శ్రీధర్‌ బాబు హీటెక్కిన సభ

Telangana Assembly Budget Sessions 9 February Live Updates - Sakshi

Updates..

► సింగ‌రేణిని ప్ర‌యివేటుప‌రం చేయాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ను భగ్నం చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సింగ‌రేణి కార్మికుల‌ను, అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌ను క‌లుపుకొని ఉద్య‌మానికి శ్రీకారం చుట్టి సింగ‌రేణిని కాపాడుకుంటామ‌ని మంత్రి పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

►బ‌య్యారం విష‌యంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట త‌ప్పింది. బ‌య్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవ‌ని కేంద్ర మంత్రి అవాస్త‌వాలు ప్ర‌చారం చేస్తున్నారు. స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుకు ప్ర‌త్యామ్నాయం ప్రారంభించాం. వ‌ర‌ల్డ్ ఎకాన‌మిక్ ఫోరంలో కూడా జిందాల్, మిట్ట‌ల్ వారితో ప్రాథ‌మికంగా సంప్ర‌దింపులు ప్రారంభించాం. కేంద్రం ముందుకు రాక‌పోతే ప్ర‌యివేటు రంగం ద్వారానైనా లేదా సింగ‌రేణి ద్వారానైనా బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

కేటీఆర్‌ వర్సెస్‌ శ్రీధర్‌ బాబు..
► అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్ ఎ‍మ్మెల్యే శ్రీధర్‌ బాబు మధ్య మాటల హీట్‌ చోటుచేసుకుంది. ధరణి పోర్టల్‌పై ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 
శ్రీధర్‌ మాట్లాడుతూ.. ధరణి రైతులకు శాపంగా మారుతోంది. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులు గందరగోళంలో ఉన్నారు. ధరణిని రద్దు చేయాలన్నదే మా నినాదం. 

► శ్రీధర్‌ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ధరణిపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలి. లోపాలు ఉంటే సరి చేస్తాం కానీ.. ధరణిని మొత్తం తొలగించం. 

► శాసన మండలి సోమవారానికి వాయిదా..

► ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్టు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కనీసం 8,9 గంటల కరెంట్‌ కూడా ఇవ్వడం లేదు. కరెంట్‌ కోసం రైతులు సబ్‌ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. కరెంట్‌ కోతలపై శాసన మండలిలో చర్చ జరగాలి. 

►  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల విద్యుత్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఇచ్చే కరెంట్‌ కూడా ఏ సమయంలో ఇస్తున్నారో చెప్పడం లేదు. ఈ విషయాన్ని సభలో సభాపతికి విన్నవించినప్పటికీ.. మా వైపు చూడటం లేదు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకురాని పరిస్థితి ఉంది. అందుకే సభ నుంచి బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాము. 

►  ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించకపోవడం దురదృష్టకరం. కరెంట్ కోతలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ కోతలపై చర్చించి పరిష్కరించాలి

►  శాసనమండలిలో మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ పథకాలు వద్దు అనుకునే వారే బడ్జెట్‌ను విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలలో నీటి యుద్దాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడ్జెట్ సమావేశాలంటే ఖాళీ కుంటలు, ఎండిన పంటలు, కరెంట్ ధర్నాలు ఉండేవి. నేడు మండు వేసవిలో నిండైన చెరువులు దర్శన మిస్తున్నాయి. 

►  దేశానికి తెలంగాణ మార్గదర్శి, దిక్సుచి అయ్యింది. ప్రజలకు హామీలు ఇవ్వడం.. మర్చిపోవడం రాజకీయ పార్టీల నైజం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలా కాదు. మిషన్ భగీరథతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా పెంచారు. ప్రజలకు సేవ చేయడం ఇతర రాష్టాల్లో ఓ రాజకీయ క్రీడ. కానీ, తెలంగాణ ప్రభుత్వానికి అదో టాస్క్. రాష్ట్రంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు జరిగాయి. రోజుకు 18 గంటలు ప్రజల గురించే ఆలోచించి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్.ప్రజల కోసం మనస్సు పెట్టి, ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తి కేసీఆర్.

►  మతాల పేరుతో ఓట్ల రాజకీయాలు కేసీఆర్ ఎప్పుడు చేయలేదు.. చేయరు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతాము. సచివాలయం ఎందుకు కడుతున్నారు అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. సచివాలయం వద్దన్నారు. ఇప్పుడేమో ప్రారంభ తేదీ మేము చెప్తే, ప్రారంభ తేదీ  కూడా మేమే చెప్తాం అని అంటున్నారు. ప్రగతి భవన్ కడితే కూడా వద్దన్నారు.

►  కొందరు నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యాదాద్రిని సీఎం కేసీఆర్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?. 

►  మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోంది. ఎన్ని పోరాటాలు చేసి అయినా ప్రైవేటీకరణను అడ్డుకుంటాము. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య నివారణకు కేంద్రం సహకరించడం లేదు. ఢిఫెన్స్‌ ఏరియాలో భూసేకరణకు కేంద్రం ముందుకు రావడం లేదు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాలు, ప్రార్థనామందిరాలను తొలగిస్తాము. ఇందు కోసం చట్టాన్ని కూడా తీసుకొస్తాము. ఏ దేవుడు ధుమ్ము, ధూళిలో ఉండాలనుకోరు.. భక్తులు కూడా కోరుకోరు. మళ్లీ వాటిని వేరే చోట నిర్మిస్తాము. 

కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌ నిర్మాణాల కోసం కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదు. ఆర్మీ జోన్‌ భూములు నైజాం భూములు. కావాలంటే కేంద్రంలో పంచాయితీ పెట్టొచ్చు. బయ్యారంపై పలుమార్లు కేంద్రం మాట తప్పింది. 

► సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top