
సాక్షి, సూర్యాపేట : భూ వివాదంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలోని నర్సింహపురం గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తనకు సంబంధంలేని భూ వివాదంలో తనపై అక్రమ కేసు నమోదు చేశారని నిరసనకు దిగాడు. మునగాల పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని సెల్ టవర్‌పై నుంచి హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అతన్ని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.