హక్కుల పరిరక్షణలో సుప్రీం కీలకపాత్ర | Supreme Court plays key role in protecting rights | Sakshi
Sakshi News home page

హక్కుల పరిరక్షణలో సుప్రీం కీలకపాత్ర

Jun 15 2025 1:56 AM | Updated on Jun 15 2025 1:56 AM

Supreme Court plays key role in protecting rights

జాతీయ సదస్సు బుక్‌ విడుదల చేస్తున్న న్యాయమూర్తులు జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ మాధవిదేవి, జస్టిస్‌ నందా, జస్టిస్‌ నర్సింగ్‌రావు

జాతీయ సదస్సులో జస్టిస్‌ రాధారాణి వెల్లడి 

పాల్గొన్న జస్టిస్‌ మాధవిదేవి, జస్టిస్‌ నందా, జస్టిస్‌ నర్సింగ్‌రావు

సిటీ కోర్టులు: ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని, పౌరుల హక్కులకు భంగం కలిగినప్పుడు కాపాడేందుకు ఆదేశాలు జారీ చేస్తోందని జస్టిస్‌ రాధారాణి పేర్కొన్నారు. కుల, మత, లింగ, ఇతర వివక్ష లేకుండా సమానత్వపు హక్కును అందించడంలో అత్యున్నత న్యాయస్థానం పాత్ర ప్రశంసనీయమన్నారు. సుప్రీంకోర్టు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్వాడి శిక్షా సమితి (ఎంఎస్‌ఎస్‌) న్యాయ కళాశాల ఆధ్వర్యంలో బేగంపేట్‌లో శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు.

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ టి.మాధవిదేవి, జస్టిస్‌ సూరేపల్లి నందా, జస్టిస్‌ నర్సింగ్‌ రావు నందికొండ, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి హాజరయ్యారు. జస్టిస్‌ టి.మాధవిదేవి మాట్లాడుతూ... దేశంలో లింగ సమానత్వం కోసం సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చిందన్నారు. పెరిగిపోతున్న లింగ భేదాన్ని తగ్గించేందుకు గర్భనిర్ధారణ పరీక్షలపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. జస్టిస్‌ సూరేపల్లి నందా మాట్లాడుతూ.. 75 ఏళ్లలో సుప్రీంకోర్టు ఇచి్చన అనేక సంచలనాత్మక తీర్పులను, వాటి పరిణామాలను చదివి వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement