మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితులు

Sravani Suicide Case Ashok Reddy Phone Switch Off - Sakshi

శ్రావణి ఆత్మహత్య కేసులో ముగిసిన విచారణ

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ ముగిసింది. ఇద్దరు నిందితులు సాయి, దేవరాజ్‌ల నుంచి కీలక సమాచారం సేకరించిన‌ పోలీసులు సోమవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామన్నారు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సాయి వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. శ్రావణి ఆత్మహత్యలో సాయి, దేవరాజ్‌ ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. ఈరోజు నిందితులను రిమాండ్ చేస్తామని వెల్లడించారు. శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని,  వాటికి సంబంధించి సాంకేతిక ఆధారాలన్నీ సేకరించామని పేర్కొన్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో దేవరాజ్, సాయి రెడ్డిలను కరోనా పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న కోవిడ్‌ సెంటర్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. (శ్రావణి కేసు : సాయి, దేవరాజ్‌ అరెస్ట్‌)

మరోవైపు శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి  ఆర్‌ఎక్స్‌ 100 మూవీ నిర్మాత అశోక్‌రెడ్డి పరారీలో ఉన్నారు. సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు ఇదివరకే నోటీసులు పంపినా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. ఉదయం నుంచి నిర్మాత అశోక్‌రెడ్డి ఫోన్ స్విచాఫ్‌లో ఉంది. దీంతో అతని కోసం గాలింపు చేపట్టే అవకాశం ఉంది. ఇక శని, ఆదివారాల్లో కొనసాగిన విచారణలో నిందితులు కీలక అంశాలను రాబట్టారు. దేవరాజ్‌ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపులకు పాల్పడటం మూలంగానే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేవరాజ్‌, సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. (మరో ట్విస్ట్‌: దేవరాజ్‌ తల్లికి శ్రావణి ఫోన్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top