ఆ కుటుంబపై పాము పగపట్టింది.. ఒకేసారి ముగ్గుర్ని..

Snake Bites Three Members of Family in Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో ఓ కుటుంబపై పాము పగబట్టింది. భార్యభర్తలతో పాటు చిన్నారిని కాటేసింది. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోగా, భార్యభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని  శనిగపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో క్రాంతి, మమత దంపతులతో పాటు వారి 3 నెలల చిన్నారిని పాము కాటేసింది.

స్థానికులు పామును పట్టుకుని చంపేసి, పాముకాటుకు గురైన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ప్రాణాపాయ స్థితిలో చిన్నారి తల్లితండ్రులు చికిత్స పొందుతున్నారు. కాటేసిన పాము విషపూరితమైన నీలిత్రాచని స్థానికులు తెలిపారు.‌ పాముకాటుతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం, తల్లిదండ్రులు ఆసుపత్రి పాలు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

చదవండి: (Anantapur: కొడుకు పెళ్లయిన వెంటనే తండ్రి మృతి.. ఆ వెంటనే..) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top