తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం | Severe Hailstorm Wreaks Havoc in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం

Apr 19 2026 5:22 PM | Updated on Apr 19 2026 6:11 PM

Severe Hailstorm Wreaks Havoc in Telangana

నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సం స్పష్టించింది.  హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌  రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగండ్ల వాన కురిసింది.  నిజామాబాద్‌లో పలు చోట్ల గంట పాటు వడగండ్ల వాన కురిసింది. 

నిజామాబాద్‌ జిల్లాలోని సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోట్ , చిన్న వాల్గోట్, భీం గల్‌లో వడగండ్ల వానతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది.  అకాల వర్షంతో అరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 

ఇక హైదరాబాద్‌లో పలు చోట్ల వడగండ్ల వాన పడింది.  ప్రధానంగా సుచిత్రా సర్కిల్‌, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది.  సికింద్రాబాద్‌, తిరుమలగిరి, అ‍ల్వాల్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, చందానగర్‌, చింతల్‌, సూరారం, దుండిగల్‌లో కూడా వడగండ్ల కురిసింది.  భారీ వర్షానికి కొన్ని చోట్ల వడగండ్లు ఇంట్లోకి సైతం వచ్చి పడ్డాయి. 

 

వాతావరణ మార్పులతో తెలంగాణలో పలుచోట్ల అకాల వర్షాలు పడతాయని ముందుగానే అధికారులు హెచ్చరించారు. రేపు, ఎల్లుండి కూడా తెలంగాణలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారుల ప్రకటన బట్టి తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement