నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల | Second installment of Rythu Bharosa on April 20: Telangana | Sakshi
Sakshi News home page

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

Apr 20 2026 4:55 AM | Updated on Apr 20 2026 4:55 AM

Second installment of Rythu Bharosa on April 20: Telangana

మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు, తుమ్మల

రైతుల సమక్షంలో రూ. 5,563 కోట్లను 

సీఎం విడుదల చేస్తారన్న మంత్రి తుమ్మల

కాళేశ్వరం: ముఖ్యమంత్రి రేవంత్‌­రెడ్డి రైతుల సమక్షంలో రెండో విడత రైతు భరో­సా పథకంకింద రాష్ట్రవ్యా­ప్తంగా సోమవారం రూ. 5,563 కో­ట్లు విడుదల చేస్తారని వ్య­వ­సాయ­శాఖ మంత్రి తుమ్మ­ల నాగేశ్వర­రావు తెలిపారు. జయశంకర్‌ భూ­పా­లపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో రైతు భరో­సా నిధుల విడుదల బహిరంగ సభను సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా ఉన్నతాధికారులు, నేతలతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి దేశంలో రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదళ్లలో రూ. లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి ఎకరాకు ఏటా రెండు దఫాలుగా రూ.12 వేలు రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నాణ్యతలేని బరాజ్‌ నిర్మించగా వినియోగించేందుకు వీలుపడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు పుణే అధికారులతో పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement