శ్మశానానికి రూ.6 కోట్ల భూమి విరాళం 

Rs 6 Crore Value Land Donate To Cremation Ground In Gundlasingaram - Sakshi

శ్మశానవాటిక కోసం దానం చేసిన గంగు గోపాల్‌రావు

భీమారం (వరంగల్): గజం స్థలం కోసం సొంతవాళ్లతో ఘర్షణ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా రూ.6 కోట్ల విలువైన భూమిని దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. వరంగల్‌ నగరం పరిధిలోని గుండ్లసింగారానికి చెందిన గంగు గోపాల్‌రావుకు స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడాన్ని గమనించి తనకున్న భూమిలోనుంచి మూడెకరాలను దానికి ఇవ్వాలని నిర్ణయించాడు. అక్కడ ఎకరం బహిరంగ మార్కెట్‌లో రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ జిల్లా నేత అల్వాల రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీ దయాకర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వివరించాడు. ఈ మేరకు శనివారం ఎంపీలు దయాకర్, బండా ప్రకాశ్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంత్‌కు పత్రాలు అందజేశారు. గోపాల్‌రావు దానమిచ్చిన మూడెకరాలలో మోడల్‌ శ్మశానవాటిక నిర్మిస్తామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. పెద్దమనసు చాటుకున్న గోపాల్‌రావును కలెక్టర్‌ అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top