నితీశ్‌, ఏక్‌నాథ్‌ పరిస్థితే చంద్రబాబుకు..: రేవంత్‌ | Revanth Reddy comments on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

నితీశ్‌, ఏక్‌నాథ్‌ పరిస్థితే చంద్రబాబుకు..: రేవంత్‌

Apr 18 2026 3:24 PM | Updated on Apr 18 2026 4:35 PM

Revanth Reddy comments on Chandrababu naidu

ఢిల్లీ: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ ప్రశ్నార్థకమేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. టీడీపీ, చంద్రబాబు నాయుడి పరిస్థితి కూడా ఇలా ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో రేవంత్‌​ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. నితీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే పరిస్థితే చంద్రబాబు నాయుడికి కూడా వస్తుందని చెప్పారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పడేస్తారని అన్నారు.

ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని తీసి పక్కన పడేస్తారని తెలిపారు. లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమేనని చెప్పారు.

వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని తెలిపారు. కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తానుగా రాజుగా  2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా? అని ప్రశ్నించారు. డిక్టేటర్‌షిప్‌ను ఎవరూ ఒప్పుకోబోరని తెలిపారు. 

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement