ఉచిత వైద్య పథకం వర్తింపజేయాలి  | Retired Govt Employees appealed To Free Medical Health Scheme | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్య పథకం వర్తింపజేయాలి 

Feb 26 2023 4:12 AM | Updated on Feb 26 2023 4:24 PM

Retired Govt Employees appealed To Free Medical Health Scheme - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఉచిత వైద్య ఆరోగ్య పథకం వర్తింప జేయాలని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధి బృందం శనివారం  మంత్రి హరీష్‌ రావును కలిసి వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించింది.

ఈహెచ్‌ఎస్, టీఎస్‌జీఆర్‌ఈఏలలో సభ్యత్వం కల్పించాలని కోరగా అందుకు మంత్రి  సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. దామోదర్‌ రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ఎ గంగారెడ్డి, ఉపాధ్యక్షులు రావిళ్ల సీతారామయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement