సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్‌ | Harish Rao Challenges Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్‌

Jul 8 2026 1:06 PM | Updated on Jul 8 2026 1:17 PM

Harish Rao Challenges Cm Revanth Reddy

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌కు నీళ్లు ఇవ్వాలన్న నిజాయతీ లేదని.. అబద్ధాల ప్రవాహంలో ఆయన మునిగి  తేలుతున్నాడంటూ మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాణహిత చేవేళ్ల పేరు మీదు రూ.2,300 కోట్లు దోచేశారని.. తుమ్మిడిహెట్టికి అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పారంటూ దుయ్యబట్టారు.

‘‘నీళ్లుండి కూడా  రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నారు. బేసిక​ నాలెడ్జ్‌ లేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సీఎంగా రేవంత్‌, మంత్రిగా ఉత్తమ్‌ ఫెయిల్‌ అయ్యారు. చెరువులు నింపే అవకాశం ఉన్న నింపడం లేదు. గోదావరి నీళ్లు వృథాగా పోతుంటే ఈ ప్రభుత్వానికి సోయి లేదు. అసత్యాలు చెప్పడంలో రేవంత్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలి. దేవాదులు నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు. కన్నెపల్లి మోటార్లు ఆన్‌ చేయమని అంటే ఎన్డీఎస్‌ఏ సాకు చెబుతున్నారు. నీళ్లుండి కూడా మోటార్లు ఆన్‌చేయకపోవడం క్రిమినల్‌ నెగ్లిజెన్స్‌’’ అంటూ హరీష్‌రావు దుయ్యబట్టారు.

‘‘నీళ్లు లేని చోట ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ రూపకల్పన చేసింది. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. తుమ్మిడిహెట్టి దగ్గర అనుమతి తెచ్చామని రేవంత్‌ అంటున్నారు. అనుమతి కాపీని సీఎం రేవంత్‌ బయటపెట్టాలి. అనుమతి  డ్యాకుమెంట్‌ను చూపిస్తే  నేను రాజీనామా చేస్తా. అనుమతి కాపీ లేకుంటే తప్పయిందని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. రాజకీయాల కోసమే అలా మాట్లాడానని రేవంత్‌ ఒప్పుకోవాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement