Today Petrol And Diesel Prices Hit All-Time High Record In Hyderabad - Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ రూ.89.15, డీజిల్‌ రూ.82.80

Jan 25 2021 3:12 AM | Updated on Jan 25 2021 10:38 AM

Petrol, Diesel Prices Touch All Time High In Hyderabad - Sakshi

పెట్రోల్, డీజిల్‌ ధరలు భగభగలాడుతున్నాయి. అంతకంతకూ పైపైకి ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆదివారం పెట్రో ఉత్పత్తుల ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. రోజువారీ సైలెంట్‌ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్‌ ధర హైదరాబాద్‌లో అత్యధికం కాగా, పెట్రోల్‌ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డును సైతం అధిగమించింది. 

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. రోజువారీ సైలెంట్‌ బాదుడుతో మునుపెన్నడూ లేనంతగా ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. దేశంలోనే డీజిల్‌ ధర హైదరాబాద్‌లో అత్యధికం కాగా, పెట్రోల్‌ ధరలో ముంబై తర్వాత స్థానానికి చేరింది. రెండేళ్ల క్రితం నాటి పెట్రోల్, డీజిల్‌ ధర ఆల్‌టైమ్‌ రికార్డును సైతం అధిగమించింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.15, డీజిల్‌ రూ.82.80కు చేరింది. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నెలలో రోజువారీ ధరల సవరణలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 2.10, డీజిల్‌పై 2.20 బాదేశాయి. పెట్రో ఉత్పత్తుల ధరల రోజువారీ సవరణ ప్రక్రియ అనంతరం తొలిసారిగా రికార్డు స్థాయిలో ధరలు ఎగబాకుతున్నాయి.

రికార్డు స్థాయిలో ..
చమురు ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును అధిగమించాయి. రెండేళ్ల క్రితం 2018, అక్టోబర్‌ 4న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.11తో ఇప్పటివరకు ఆల్‌టైమ్‌ రికార్డుగా నమోదైంది. దానికంటే ఐదేళ్ల క్రితం 2013, సెప్టెంబర్‌ నెలలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 83.07తో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఇక డీజిల్‌ 2018, అక్టోబర్‌ 18న లీటర్‌ ధర రూ.82.38తో ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసుకోగా ప్రస్తుతం గరిష్టానికి చేరిన ధరతో పాత రికార్డును అధిగమించినట్లయింది.

పన్నులు అధికమే..
పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో దాదాపు సగానికిపైగా పన్నుల వడ్డింపు ఉంది. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజీల్‌పై 44 శాతం పన్నులు ఉంటాయి. వాస్తవంగా పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ పన్ను మోత మోగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement