బిడ్డ ఆకలి..రోడ్డుపై పడేసిన పండ్లే పంచామృతం

The Pain Of a Mother Make Her Kid Happy - Sakshi

సాక్షి, జనగామః బిడ్డ ఆకలి తీర్చేందుకు ఓ తల్లి పడే వేదన.. కన్నీళ్లు పెట్టిస్తుంది. ఏడాదిన్నర చిన్నారిని తన ఒడిలో వేసుకుని బిక్షాటనకు బయలు దేరిన తల్లి... రోడ్డుపై పడేసిన పండ్లే పంచామృతంగా స్వీకరిస్తోంది. జిల్లా కేంద్రం సిద్ధిపేట రోడ్డు లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చెత్త బుట్టలో కుల్లిన పండ్లు,  కూరగాయలను వేశారు. 

ఆ సమయంలో చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చిన ఓ తల్లి... చిన్నారి ఆకలి తీర్చేందుకు..బుట్టలో ఉన్న పండ్లు, కూరగాయలను ఏరుకుని...సంతోషంగా వెళ్లిపోయింది. కన్న బిడ్డ కోసం తల్లిపడే తపన ప్రతి ఒక్కరి మనసును కదలిస్తుంది. పండ్లను సేకరిస్తూ జోలెలో వేసుకునే సమయంలో ఒడిలో ఉన్న చిన్నారి ముఖంలో కనిపించే చిరునవ్వు. కోట్లు ఖర్చు చేసి కారుకొనిచ్చినా రాదు కావచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top