దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం 

Navratri 2022: Goddess Durga Devi Alankaram with RS 5 Crores At Mahabubnagar - Sakshi

దేవీ శరన్నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తోంది. వేడుకల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అలంపూర్‌ జోగుళాంబ, బాసర సరస్వతి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గను, వరంగల్‌ భద్రకాళిదేవిని శ్రీలలితాత్రిపుర సుందరిగా అలంకరించారు.
– జోగుళాంబ శక్తిపీఠం(గద్వాల జిల్లా)/ హనుమకొండ కల్చరల్‌/ బాసర(ముథోల్‌)

దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. రూ.5,55,55,555.55(5 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల 55 పైసలు)ల కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. 
– స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top