
చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద్
సాక్షి, జగద్గిరిగుట్ట: తల్లిదండ్రులను కోల్పోయిన టీఆర్‌ఎస్ కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లు అయ్యేంత వరకు ఆసరాగా ఉంటామని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. జగద్గిరిగుట్టకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త వెంకటరమణ కుమార్తె వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు 6 సంవత్సరాల కుమార్తె ఉండటంతో చిన్నారి ఆలనా పాలనా చూసేందుకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపలి హన్మంతరావు ముందుకొచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం వెంకటరమణ కరోనాతో మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. ఆదివారం జగద్గిరిగుట్టకు చేరుకున్న ఆయన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున రూ.5 లక్షల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారి చదువుతో పాటు పెళ్లి అయ్యేంత వరకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరి, టీఆర్‌ఎస్ నాయకులు జైహింద్, రాజేష్, సయ్యద్ రషీద్, ఎర్ర యాకయ్య, సాజిద్, మారయ్య, రుద్ర అశోక్, ఇతర కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.