బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు | minister ponnam prabhakar said that the free electricity scheme will continue | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ధోబీ ఘాట్లకు కరెంటు బిల్లులు చెల్లించలేదు

Jan 5 2024 2:47 AM | Updated on Jan 5 2024 8:07 AM

minister ponnam prabhakar said that the free electricity scheme will continue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాండ్రీలు, ధోబీఘాట్‌లు, హెయిర్‌ కటింగ్‌ సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గత ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించిందని, అందుకయ్యే వ్యయాన్ని మాత్రం డిస్కంలకు చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు.

అయితే బకాయిల పేరిట విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించొద్దని డిస్కంలకు మంత్రి సూచించారు. ఈ విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతామన్నారు. ఈ ఏడాది జనవరి మూడోతేదీ వరకు వాషర్‌మె న్‌లో లబ్ధిదారులు 76,060 మంది కాగా, బకాయిలు రూ.78.55 కోట్లు అని, నాయీ బ్రాహ్మణ లబ్ధిదారులు 36,526 మంది కాగా, బకాయిలు రూ.12.34 కోట్లు ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement