స్కూల్లో తప్పదాగి చిందులేసిన ఎంఈఓ.. వీడియో వైరల్‌

MEO Officer Drunk And Dance In School At Adilabad District - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మద్యానికి బానిసై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. తాగి పాఠశాలకు వెళ్లిన టీచర్లపై అధికారులు చర్యలు తీసుకున్న వార్తలు చదివాం. అయితే, ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే మండల విద్యాధికారే పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన తాజాగా బయటపడింది. తాగిన మైకంలో ఆయన చిందులేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది.

ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించి ఓ స్కూల్‌ ఆవరణలో డ్యాన్స్‌ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఈవో, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఎంఈవో అధికారి తాగి చిందులేయడం దారుణం, ఇది చాలా హేయమైన చర్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇస్తే జైలుకే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top