హోలీ పండుగకు భార్య మటన్‌ వండలేదని 100కు కాల్‌..

Man Dials100 To Tomplain Against Wife For Not Cooking Mutton Curry  - Sakshi

నల్గొండ (కనగల్‌) : భార్య మటన్‌ వండలేదని ఓ వ్యక్తి 100కు కాల్‌ చేసి కేసుల పాలయ్యాడు. ఎస్‌ఐ యు. నగేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఓర్సు నవీన్‌ తన భార్య మటన్‌ వండలేదని డయల్‌ 100కు ఆరు సార్లు కాల్‌ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అనవసరంగా కాల్‌ చేసి ఇలా పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో కేసు నమోదు చేశారు. ఆపద, అత్యవసర సేవలకోసం మాత్రమే డయల్‌ 100కు పోన్‌ చేయాలని ఎస్‌ఐ సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top