కొలకలూరి పురస్కారాలు ప్రదానం | Kolakaluri Awards 2022 Celebration Ceremony Held In Hyderabad | Sakshi
Sakshi News home page

కొలకలూరి పురస్కారాలు ప్రదానం

Feb 27 2022 2:39 AM | Updated on Feb 27 2022 4:00 PM

Kolakaluri Awards 2022 Celebration Ceremony Held In Hyderabad - Sakshi

కె.పి ఆశోక్‌ కుమార్‌ను సత్కరిస్తున్న ఆచార్య  టి. కిషన్‌రావు. చిత్రంలో కొలకలూరి ఇనాక్‌ 

నాంపల్లి: కొలకలూరి పురస్కారాలు–2022 ప్రదానోత్సవ సభ శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నంద మూరి తారక రామా రావు కళామందిరం లో జరిగింది. కొలక లూరి ఇనాక్‌ అధ్యక్ష తన జరిగిన సభకు ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి.కిషన్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొలకలూరి భగీరథీ కథానిక–2022 పురస్కారాన్ని విజయ భండారు (కథానిక సంపుటి–గణిక), కొలకలూరి విశ్రాంతమ్మ నవల–2022 పురస్కారాన్ని మథని శంకర్‌ (నవల–జక్కులు), కొలకలూరి రామయ్య విమర్శన–2022 పురస్కారాన్ని అశోక్‌కుమార్‌ (తెలుగు నవల–ప్రయోగ వైవిధ్యం) స్వీకరించారు. పురస్కారాల కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేసి స్వీకర్తలను సత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement