హైదరాబాద్‌ పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం | Key Mastermind Vandana Arrested In Hyderabad Child Trafficking Case | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం

Mar 7 2025 3:20 PM | Updated on Mar 7 2025 3:39 PM

Key Mastermind Vandana Arrested In Hyderabad Child Trafficking Case

హైదరాబాద్‌ పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కలకలం రేపిన పిల్లల అమ్మకాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ కేసులో కీలక సూత్రధారి వందనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అహ్మదాబాద్‌ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మిన వందన.. నలుగురు బ్రోకర్లకు నలుగురు పిల్లలను విక్రయించింది. అహ్మదాబాద్‌కు చెందిన వందనను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వందన.. ఆసుపత్రుల నుంచి, రోడ్లపై చెత్త ఏరుకునే వారి పిల్లలను అపహరించినట్లు తమ విచారణ తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పేద తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. వందనను 5 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరారు.

 

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement