సాక్షి, హైదరాబాద్: దేశంలోని మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్‌లో హైదరాబాద్ చిట్ట చివరన నిలిచింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. నగరంలోని లైసెన్స్ పొందిన 25,000 హోటళ్లలో కేవలం 2% (361) మాత్రమే పరిశుభ్రత రేటింగ్స్ పొందాయి.
ఈ విషయంలో ఢిల్లీ (3,394), బెంగళూరు (2,200) కంటే నగరం రేటింగ్స్ చాలా తక్కువ. అదే విధంగా ఈ తనిఖీల్లో లైసెన్సులు లేని విక్రయాలు, గడువు ముగిసిన ఉత్పత్తుల వాడకం వంటివి బయటపడినట్లు, తద్వారా నగరంలో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆ డేటా స్పష్టం చేసింది.


