బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు

Hyderabad: Integrated Command and Control Centre Inauguration, Traffic Diversion - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 4న బంజారాహిల్స్‌లో హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్యాలయం, పోలీసు ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్‌ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి రోడ్డు నంబర్‌–36, 45 మీదుగా మాదాపూర్‌ వైపునకు మళ్లాలి. మాసబ్‌ట్యాంక్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్‌ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. 

ఫిల్మ్‌నగర్‌ మీదుగా ఒర్సి ఐస్‌ల్యాండ్‌ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్‌ భవన్, సాగర్‌ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్‌ మీదుగా రోడ్డు నంబర్‌ 12, జూబ్లీహిల్స్‌ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి.


4న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభించనున్న సీఎం

బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. నూతనంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనాన్ని మంగళవారం ఆయ న హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు నాగేందర్, గోపీనాథ్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌ గుప్తా, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్‌ చేతుల మీదు గా ప్రారంభం జరుగుతుందని తెలిపారు. (క్లిక్: జీహెచ్‌ఎంసీ నెత్తిన మరో పిడుగు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top