పేరు పెట్టమన్న హైదరాబాద్‌ సీపీ.. ఆ పోస్టుకు అనూహ్య స్పందన

Hyd CP CV Anand Suggest To Citizens To Name Police Tower - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికే తలమానికంగా బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు (సీసీసీ) పేరు సూచించాలంటూ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నెటిజనులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ సిటీ పోలీసు అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్‌ నం.12లో 20 అంతస్తుల ఎత్తుతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని ప్రస్తుతం ట్విన్‌ టవర్స్‌గా పిలుస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇందులో మొత్తం నాలుగు టవర్స్‌ ఉంటాయని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్‌ పోలీసుకే కాకుండా తెలంగాణ పోలీసు విభాగానికే ఇది కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా పనిచేస్తుందని స్పష్టం చేసిన ఆనంద్‌... ఆ మేరకు సరైన పేరు సూచించాలని కోరారు.

చదవండి: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్‌ పరిస్థితి

ఈ పోస్టుకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోస్ట్‌ చేసిన ఐదు గంటల్లోనే 1500 మంది లైక్‌ చేయగా...1100 మంది వివిధ పేర్లను సూచించారు. కమాండో హిల్స్, 4 లయన్స్, సీ4, ఫెడ రల్‌ టవర్స్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ (ఎఫ్‌టీటీ ఎస్‌), చార్‌మినార్‌ ప్రొటెక్షన్‌ సెంటర్‌ (సీపీసీ) తదితర పేర్లను నెటిజనులు సూచించారు. మా ర్చి 31లోగా నిర్మాణం పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆనంద్‌ ఇటీవలే కాంట్రాక్టర్‌కు సూచించిన విషయం విదితమే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top