ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rain In Many Places In Hyderabad | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షం

Jun 7 2025 3:36 PM | Updated on Jun 7 2025 5:28 PM

Heavy Rain In Many Places In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ.. ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. వర్షం పడటంతో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం పొందారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది.

తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement