
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని గురువారం (జూలై 17)సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్‌ఎంసీ) అప్రమత్తం చేసింది.
నగరానికి భారీ వర్ష సూచన అన్న అప్‌డేట్ వచ్చిన కాసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం పడింది. పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, మూసాపేట్, సనత్‌నగర్, ఎర్రగడ్డలో కుండపోత వర్షం పడగా, కూకట్‌పల్లి, బాలానగర్, మాదాపూర్‌లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీలో సైతం భారీ వర్షం పడింది.
భారీ వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారిలో ఆందోళన మొదలైంది. ఆఫీస్ షిష్ట్‌లు ఐదు గంటలకు ముగిసే వారు ఆగమేఘాల మీద ఇళ్లకు బయలుదేరారు.
