
వాడి శివారులో నేలకూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలిస్తున్న హరీశ్‌రావు
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
హవేళిఘణాపూర్ (మెదక్): ప్రజలు వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడు తుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం వారి కష్టాలు పట్టించుకోకుండా మూసీ నది, క్రీడ లపై సమీక్షలు చేయడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజ మెత్తారు.
బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకని ప్రశ్నించారు. గురువారం ఆయన వరద లతో ప్రభావితమైన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం ధూప్‌సింగ్ తండా, నాగా పూర్, వాడి గ్రామాలను సందర్శించారు. కొట్టు కుపోయిన బ్రిడ్జి, రోడ్లను పరిశీలించారు.