కరోనాతో గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ కుమార్తె మృతి | Gudimalkapur Corporator Daughter Deceased Of Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాతో గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ కుమార్తె మృతి

May 10 2021 9:04 AM | Updated on May 10 2021 11:03 AM

Gudimalkapur Corporator Daughter Deceased Of Coronavirus - Sakshi

సాక్షి, గోల్కొండ: గుడిమల్కాపూర్‌ కార్పొరేటర్‌ దేవర కరుణాకర్‌ కూతురు ఆవుల భవాని (29) కరోనాతో మృతి చెందారు. వారం రోజులుగా ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, 15 రోజుల బాబు ఉన్నాడు. కాగా హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం దేవర కరుణాకర్‌కు పంపిన ఒక సందేశంలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో నిబ్బరంగా ఉండాలని ఆయన దేవర కరుణాకర్‌ను కోరారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని హిందూశ్మశాన వాటికలో జరిగాయి.

చదవండి: వరంగల్, ఆదిలాబాద్‌లలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement