అనాథ వసతి గృహ విద్యార్థికి ల్యాప్‌టాప్‌ విరాళం  | Giridharswamy Donates Rs 52000 Worth Laptop To Orphanage Student Hyderabad | Sakshi
Sakshi News home page

అనాథ వసతి గృహ విద్యార్థికి ల్యాప్‌టాప్‌ విరాళం 

Feb 10 2022 5:40 AM | Updated on Feb 10 2022 4:37 PM

Giridharswamy Donates Rs 52000 Worth Laptop To Orphanage Student Hyderabad - Sakshi

ల్యాప్‌టాప్‌ అందజేస్తున్న గిరిధర్‌ స్వామి  

దిల్‌సుఖ్‌నగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గిరిధర్‌ స్వామి బుధవారం ఆర్‌కేపురం డివిజన్‌లో చిత్రలేవుట్‌ కాలనీలో ఉన్న అనాథ వసతి గృహ విద్యార్థి రాజానాయక్‌కు రూ.52,000 విలువైన ల్యాప్‌టాప్‌ విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిధర్‌ స్వామి  మాట్లాడుతూ అనాథ అయిన రాజా నాయక్‌ను చేరదీయడమేగాక భువనేశ్వర్‌ ఐఐటీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ సీటు సాధించడంలో వసతి గృహం నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. అతడి విద్యాభ్యాసం కోసం స్నేహితుల సహకారంతో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమములో వసతి గృహ అధ్యక్షులు మార్గం రాజేష్, స్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement