జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక: ట్రాఫిక్‌ ఆంక్షలు  | GHMC Mayor Election:Traffic Restrictions In Hyderabad | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నిక: ట్రాఫిక్‌ ఆంక్షలు 

Published Thu, Feb 11 2021 9:27 AM | Last Updated on Thu, Feb 11 2021 10:08 AM

GHMC Mayor Election: Traffic‌ Restrictions In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మేయర్‌ ఎన్నికల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంక్షలు గురువారం ఉదయం 9 నుంచి సా. 4 గంటల వరకు అమలులో ఉంటాయి. 
అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి లిబర్టీ జంక్షన్‌ వైపు వాహనాలను అనుమతించరు. వీటిని అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తా నుంచి తెలుగు తల్లి జంక్షన్‌ వైపు మళ్ళిస్తారు.

లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తా వైపు వాహనాలను అనుమతించరు.  కట్టమైసమ్మ చౌరస్తా నుంచి తెలుగు తల్లి ఫైఓవర్‌ మీదుగా పంపిస్తారు.

హిమాయత్‌నగర్‌ నుంచి వచ్చే వాహనాలను అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తా వైపు అనుమతించరు. వీటిని లిబర్టీ జంక్షన్‌ నుంచి బషీర్‌బాగ్, నిజాం కాలేజీ, అసెంబ్లీ మీదుగా పంపిస్తారు.
బషీర్‌బాగ్‌ వైపు నుంచి అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తా వైపు వచ్చే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్, పోలీసు కంట్రోల్‌ రూమ్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు.

తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్‌ వైపు వాహనాలను పంపించరు. వీటిని ఇక్బాల్‌ మీనార్‌ జంక్షన్‌ నుంచి రవీంద్రభారతి చౌరస్తా మీదుగా మళ్లిస్తారు. 

పోలీసు కంట్రోల్‌ రూమ్‌ చౌరస్తా నుంచి ఆదర్శ్‌నగర్‌ మీదుగా తెలుగుతల్లి చౌరస్తా వైపు వచ్చే వాహనాలను  రవీంద్రభారతి, ఇక్బాల్‌ మీనార్‌ వైపు నుంచి పంపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement