బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి | Former Congress Minister Dr A Chandrasekhar Joined BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి

Jan 18 2021 6:51 PM | Updated on Jan 18 2021 8:45 PM

Former Congress Minister Dr A Chandrasekhar Joined BJP - Sakshi

సాక్షి, వికారాబాద్ : కాంగ్రెస్‌ మాజీ మంత్రి డా.ఏ.చంద్రశేఖర్ బీజేపీలోకి చేరారు. వికారాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేసీఆర్‌ ప్రభుత్వం​ ఒక్క పైసా ఇవ్వలేదని, మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సర్పించ్‌ని కలెక్టర్‌ సస్పెండ్‌ చేసే జీవో తెచ్చిన కేసీఆర్‌..సీఎంను కూడా సీఎస్‌ సస్పెండ్‌ చేసే జీవో తేవాలని డిమాండ్‌ చేశారు. తలనరుక్కుంటా అని గతంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌ ఆత్మహత్య చేసుకుంటా అన్నారు..ఆత్మహత్య నేరం.. 309 సెక్షన్ కింద కేసీఆర్‌పై  కేసు నమోదు చేయాలని తెలిపారు. వికారాబాద్‌ని చార్మినార్ జోన్‌లో కలపాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement