Hyderabad: పెట్రోల్‌ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి | fire accident in Mallapur Indian Oil Petrol Bunk | Sakshi
Sakshi News home page

Hyderabad: పెట్రోల్‌ పోస్తుండగా నిప్పుపెట్టిన ఆకతాయి

Oct 27 2024 6:50 AM | Updated on Oct 27 2024 9:53 AM

fire accident in Mallapur Indian Oil Petrol Bunk

మల్లాపూర్‌: మల్లాపూర్‌ ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోలు పోస్తుండగా ఓ ఆకతాయి నిప్పు అంటించిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆరి్పవేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఎస్‌ఐ మైబెలి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్‌ ఓల్డ్‌ మీర్‌పేట్‌కు చందన్‌కుమార్‌ (19) తన స్నేహితులతో కలిసి యాక్టివా ద్విచక్రవాహనంలో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకోవడానికి వచ్చారు.

అదే సమయంలో సిబ్బంది వేరే కస్టమర్‌కు బాటిల్‌లో పెట్రోల్‌ పోస్తుండగా చందన్‌కుమార్‌ సడన్‌గా జేబులోంచి లైటర్‌ తీసి వెలిగించాడు. ‘అంటించమంటారా..’ అంటూ పెట్రోలు నింపుతున్న సిబ్బంది దగ్గరకు వచ్చి అంటించాడు. దీంతో గన్‌కు మంటలు అంటుకున్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్‌ ఫోమ్‌తో మంటలు ఆరి్పవేశారు. దీంతో పెట్రోల్‌ బంక్‌లో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా..చందన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement