లక్ష కేసులొచ్చినా వైద్యం

Etela Rajender Comments On Coronavirus - Sakshi

ఆ సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న మంత్రి ఈటల 

వైద్య సిబ్బంది సేవలు అద్భుతం 

మండలిలో కోవిడ్‌పై చర్చకు సమాధానం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లక్ష పాజిటివ్‌ కేసులొచ్చినా చికిత్స, వైద్యం అందించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరో నా రహిత రాష్ట్రంగా కాకపోయినా వైరస్‌ చావులు లేని తెలంగాణగా మార్చేందుకు అందరూ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరు నెలలుగా తా ను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తుంటే.. ‘ఏయ్‌ రాజేందర్, ఎన్ని వందల కోట్ల డబ్బుతో సూట్‌కేసులు వచ్చాయి’అంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడం బాధించిందన్నారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని టీవీ చానళ్లు, కొన్ని పత్రికలు సంచలనాల కోసం దుష్ప్రచారాలు చేశాయన్నారు.

కరోనా చికిత్స కోసం ఎన్ని డబ్బులైనా వెచ్చించమని, ఏ మందులైనా కొనమని సీఎం కేసీఆర్‌ చెప్పారన్నారు. గురువా రం శాసన మండలిలో కోవిడ్‌–19 పై స్వల్ప వ్యవ ధి చర్చ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్ర భావం, దాని నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి వివరించారు. వైద్యశాఖ సిబ్బం ది సేవలు, చేస్తున్న శ్రమ, త్యాగానికి ఏం చేసినా తక్కువేనన్నారు. వారికి రెండు నెలలే ఇన్సెంటివ్‌ ఇచ్చామని, ఇంకా ఏమి చేయాలన్న దానిపై ప్రభు త్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో 120 ఐసోలేషన్‌ సెంటర్లలో మందులు, భోజనం వంటివి అందిస్తున్నామని.. ఎమ్మెల్యేలు ఎవరైనా కోరితే వారి నియోజకవర్గాల్లో ఈ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు.  

కఠిన చర్యలుంటాయ్‌...: 
కరోనా పేషెంట్లకు వెంటిలేటర్‌ లేకుండా రూ. 10 వేలు, ఐసీయూలో రూ. 50 వేలు, వెంటిలేటర్‌ పెట్టిన పక్షంలో రూ.2 నుంచి 3 లక్షలు మాత్రమే ఖర్చవుతుండగా, కొన్ని ఆసుపత్రుల్లో రూ. 20 నుంచి 30 లక్షలు వసూలు చేసినట్టు వార్తలొచ్చా యన్నారు. అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు చెప్పారు. 

కేంద్రం నుంచి రూ.6 వేల కోట్లు... 
కేంద్ర ప్రభుత్వం నుంచి మాస్క్‌లు, పీపీఈ కిట్లు, మందులు, టెస్ట్‌ కిట్లు ఇలా అన్నీ కలుపుకుని మొ త్తం రూ.6 వేల కోట్లు రాష్ట్రానికి అందిందని బీజే పీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు అన్నారు. ప్రైవే ట్‌ ఆసుపత్రుల్లో కరోనా చార్జీల నియంత్రణపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ను పట్టించుకోకుండా, ఆరోగ్యశ్రీనే బాగుందన్నప్పు డు కోవిడ్‌ చికిత్సను కూడా అందులో చేర్చాలన్నారు. మంత్రి ఈటల పని తీరు అభినందనీయమని, టెస్ట్‌లు ఎక్కువ చేసి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాలని కోరారు.  

ఆశించిన స్థాయిలో సేవలులేవు.. 
కరోనా వైరస్‌ను ఆరంభంలోనే నిలువరించి ఉంటే బావుండేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. జిల్లాల్లో మౌలిక సదుపాయాల కొరతతో ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారని చెప్పారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల తీరు ఘోరంగా ఉందని, 50 శాతం బెడ్స్‌ను అలాట్‌ చేసేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ చర్చలో బోడకుంటి వెంకటేశ్వర్లు, అమీనుల్‌జాఫ్రీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఫారుఖ్‌హుస్సేన్, కాటేపల్లి జనార్దనరెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top