Osmania University: ఓయూలో దసరా సెలవులు ఇలా

Dussehra 2022: Osmania University Holidays And PG Counselling Schedule - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు శనివారం నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్‌ఎల్‌ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8 వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్‌ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.  

26న పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూలు 
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్‌–2022 కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి  ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు. 

పీజీ ప్రవేశ పరీక్షలో  (సీపీజీఈసెట్‌–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్‌ తిరస్కరించనున్నట్లు కన్వీనర్‌ పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: టీహబ్‌–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు ప్రారంభం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top