
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 5089 టీచర్ల పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 20వ తేదీ నుంచి అక్టో బర్ 21వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1వ తేదీ నాటికి 18-44 ఏళ్లు ఉండాలి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు, మాజీ సైనికోద్యోగులకు మూడేళ్లు, సాయుధ దళాలలో చేసిన సర్వీస్ కాలం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో పదేళ్ల పాటు సడలింపు ఉంటుంది. పూర్తి సమాచారం ఈ నెల 20 నుంచి అధికారిక వెబ్‌సైట్ (https://schooledu.telangana.gov.in/ISMS/)లో అందుబాటులో ఉంచనున్నారు.