బెల్టు హుక్స్‌లో బంగారం  | Customs Officials Seized Gold In Belt Hooks Hyderabad | Sakshi
Sakshi News home page

బెల్టు హుక్స్‌లో బంగారం 

Published Wed, Feb 16 2022 3:06 AM | Last Updated on Wed, Feb 16 2022 3:06 AM

Customs Officials Seized Gold In Belt Hooks Hyderabad - Sakshi

శంషాబాద్‌: బెల్టు హుక్స్‌లో తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం ఇండిగో విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అతడి లగేజీలో ఉన్న ఓ బెల్టును తనిఖీ చేయగా దాని హుక్స్‌కు ఉన్న పైపూతను తీయడంతో  వాటిని బంగారంగా గుర్తించారు. 300 గ్రాముల బరువు ఉన్న బంగారు హుక్స్‌ రూ.18.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement